తదుపరి వార్తా కథనం
Rishabh Pant: చెమటొడ్చి సైక్లింగ్ చేసిన రిషబ్.. సోషల్ మీడియాలో వీడియో!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 29, 2023
05:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.
సొంతంగా బరువులు ఎత్తుతూ తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా రిషబ్ పంత్ షేర్ చేస్తున్నాడు.
తాజాగా పంత్ సైక్లింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు ఎంతో బలంగా ఉన్నానని, త్వరలోనే పూర్తి ఫిట్ నెస్ సాధిస్తానని, శస్త్ర చికిత్స జరిగిన తర్వాత మోకాలిని వంచుతున్నానని, గుడ్ వైబ్స్ అంటూ క్యాప్షన్ జోడించి వీడియోను పంత్ పోస్టు చేశాడు.
ఇక పంత్ కసరత్తులు చూసిన అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సైక్లింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేసిన పంత్
Grip. Twist. Paddle.
— Rishabh Pant (@RishabhPant17) August 28, 2023
Good vibes only. 🚴#RP17 pic.twitter.com/fH4JyycTen