Page Loader
Rajasthan Royals Captain: రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్

Rajasthan Royals Captain: రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ సీజన్‌లో జట్టు ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు నాయకత్వం వహించట్లేదు. ఈ విషయాన్ని ఆర్ఆర్ అధికారికంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఫిట్‌నెస్ సమస్య కారణంగా శాంసన్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో, అతని స్థానంలో యువ క్రికెటర్ రియాన్ పరాగ్ జట్టు నాయకుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

వివరాలు 

మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్

"ఐపీఎల్ 2025లో తొలి మూడు మ్యాచ్‌లకు సంజు శాంసన్ కేవలం బ్యాటర్‌గానే పరిమితం కానున్నారు. ఫిట్‌నెస్ కారణంగా వికెట్‌కీపింగ్, ఫీల్డింగ్ బాధ్యతలను నిర్వర్తించరు. దీంతో, ఈ మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శాంసన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించిన వెంటనే మళ్లీ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపడతాడు" అని రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. ఐపీఎల్ 2025, అంటే లీగ్ 18వ ఎడిషన్, మార్చి 22న ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. ఇక, రాజస్థాన్ రాయల్స్ మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

వివరాలు 

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజు శాంసన్ కి గాయం 

సంజు శాంసన్ గాయపడిన నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి గాయం అయ్యింది. గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమైన శాంసన్, శస్త్రచికిత్స అనంతరం తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ మార్చి 26న కోల్‌కతా నైట్ రైడర్స్, మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. 2008లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాజస్థాన్, గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలై ఫైనల్ చేరేందుకు విఫలమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్‌ రాయల్స్‌ చేసిన ట్వీట్