
IND Vs AFG: శతకొట్టిన రో'హిట్'.. ఆఫ్గాన్‌పై టీమిండియా భారీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్గానిస్తాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
రోహిత్ శర్మ 84 బంతుల్లో (16 ఫోర్లు, 5 సిక్సర్లు) 131 పరుగులు చేయడంతో భారత 90 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించింది.
మొదట ఆఫ్గాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా, భారత్ 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
విరాట్ కోహ్లీ 55 హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించగా, ఇషాన్ కిషన్ 47, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులతో రాణించారు.
ఈ మ్యాచులో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ(555) అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
8 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
India march to their second successive win off the back of a dominant display in Delhi 💪#CWC23 #INDvAFG pic.twitter.com/Z0gyJC8r5f
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2023