Page Loader
Rohit Sharma : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు అరుదైన రికార్డు పై క‌న్నేసిన రోహిత్ శ‌ర్మ‌..  
ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు అరుదైన రికార్డు పై క‌న్నేసిన రోహిత్ శ‌ర్మ‌

Rohit Sharma : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు అరుదైన రికార్డు పై క‌న్నేసిన రోహిత్ శ‌ర్మ‌..  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుండగా, పోటీలు హైబ్రిడ్ మోడల్‌లో జరుగనున్నాయి. టీమ్ఇండియా పాల్గొనే అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు, మూడోసారి టైటిల్‌ను దక్కించుకునే లక్ష్యంతో సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ను ఓ మైలురాయి ఊరిస్తోంది.

వివరాలు 

అరుదైన మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ … 

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శతకంతో రోహిత్ శర్మ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. మూడో వన్డేలో స్వల్ప స్కోరుకే ఔటైనప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు హిట్‌మ్యాన్ మంచి టచ్‌లోకి రావడం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. ఈ టోర్నీలో భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 12 పరుగులు చేస్తే, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

వివరాలు 

రోహిత్ శర్మ వన్డే రికార్డు: 

ఇప్పటివరకు 268 వన్డేలు ఆడిన రోహిత్ 260 ఇన్నింగ్స్‌లలో 10,988 పరుగులు సాధించాడు. 49.0 సగటుతో 32 శతకాలు, 57 అర్ధశతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు. అత్యంత వేగంగా 11,000 వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ (భారత్) - 222 ఇన్నింగ్స్‌లు సచిన్ టెండూల్కర్ (భారత్) - 276 ఇన్నింగ్స్‌లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 286 ఇన్నింగ్స్‌లు సౌరవ్ గంగూలీ (భారత్) - 288 ఇన్నింగ్స్‌లు జాక్వెస్ కాలిస్ (దక్షిణాఫ్రికా) - 293 ఇన్నింగ్స్‌లు

వివరాలు 

వ‌న్డేల్లో 11000ఫ్ల‌స్ రన్స్‌ చేసిన ఆట‌గాళ్లు వీరే.. 

రోహిత్ శర్మ ఈ ఘనతను సాధిస్తే... అతను 11,000 వన్డే పరుగులు పూర్తి చేసిన పదో ఆటగాడిగా నిలవనున్నారు. సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక‌) - 14, 234 ప‌రుగులు విరాట్ కోహ్లీ (భార‌త్) - 13,963 ప‌రుగులు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 13,704 ప‌రుగులు స‌న‌త్ జ‌యసూర్య (శ్రీలంక‌) - 13,430 ప‌రుగులు జ‌య‌వ‌ర్థ‌నే (శ్రీలంక‌) - 12,650 ప‌రుగులు ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్‌) - 11,739 ప‌రుగులు జాక్వెస్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) - 11579 ప‌రుగులు సౌర‌వ్ గంగూలీ (భార‌త్‌) - 11363 ప‌రుగులు