
Rohit Sharma : టెస్ట్ క్రికెట్'కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
రోహిత్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తొలగించారనే వార్తలు వైరల్ అయిన కొన్ని నిమిషాల తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇప్పటి వరకు 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 4,301 పరుగులు( 40.57 సగటుతో ) చేశాడు. అందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలున్నాయి.
ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. భారత్ తరఫున ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగుతాడు.
కాగా , వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని ఎన్నోసార్లు చెప్పిన రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడే అవకాశాలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టెస్ట్ క్రికెట్'కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
STORY | Rohit Sharma announces retirement from Test cricket with immediate effect
— Press Trust of India (@PTI_News) May 7, 2025
READ: https://t.co/yFyVU5r2gL https://t.co/50VdD9yjxc
వివరాలు
టెస్టుల్లో ఇటీవల ఫామ్ లోపం కారణంగానే..
రోహిత్ శర్మ ఇప్పటివరకు 24 టెస్టు మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించగా, అందులో 12 విజయాలు సాధించాడు.
జూన్ 2025లో జరిగే ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపికకు ముందు రోహిత్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2025లోని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ నిరాశపరిచాడు.పేలవ ఫామ్ కారణంగా చివరి టెస్టు మ్యాచ్ నుంచి అతను స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే.
టెస్టు క్రికెట్‌లో ఇటీవల అతడి పేలవ ప్రదర్శనలే రోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.