Rohit Sharma Record: రోహిత్ శర్మ నయా రికార్డు..100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా
కొత్త ఏడాది తొలి టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి భారత జట్టు సిరీస్‌ను శుభారంభం చేసింది. మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శివమ్ దూబే అజేయంగా 60 పరుగులు, 1 వికెట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తప్పిదంతో రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ రనౌట్ అయ్యాడు, కానీ అదే సమయంలో రోహిత్ టీ20 క్రికెట్‌లో తన పేరు మీద ప్రత్యేక రికార్డును నెలకొల్పాడు.
రోహిత్ శర్మ పేరిట ప్రపంచ రికార్డు
నిజానికి, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 14 నెలల తర్వాత T20 ఇంటర్నేషనల్‌లో పునరాగమనం చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అంతర్జాతీయ T20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు.రోహిత్ ఈ ఘనతను 149 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు. అంతర్జాతీయ T20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ పేరిట ఉంది. ఆమె 111 టీ20ల్లో విజయాల్లో భాగమైంది. రోహిత్ శర్మ తరువాత పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 86 విజయాలతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ 73 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.