ధోని రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన ఫీట్ ను హిట్ మ్యాన్ సాధించాడు. రెండో టెస్టు తొలి రోజు 80 పరుగులు చేసిన రోహిత్, ఇండియా తరుఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ ఐదో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో ధోనిని అధిగమించాడు. ఇప్పటివరకూ ఇండియా తరుఫున 443 మ్యాచులాడిన రోహిత్ 42.92 సగటుతో 17,298 పరుగులు చేశాడు. ఇందులో 44 సెంచరీలు, 92 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక ధోనీ 535 మ్యాచుల్లో 17092 రన్స్ చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలను బాదాడు.
రోహిత్ శర్మ సాధించిన రికార్డులివే
ఇండియా తరఫునే కాకుండా అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సచిన్ టెండుల్కర్ నిలిచాడు. 664 మ్యాచుల్లో 34,357 పరుగులు చేశాడు. టీమిండియా తరుఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హిట్ మ్యాన్ ఐదో స్థానంలో నిలిచాడు. ఇక టెస్టుల్లో కెప్టెన్ గా రోహిత్ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ టెస్టుల్లో 15 సిక్సర్లను బాదాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు మోర్గాన్(233 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉన్నాడు. మరోవైపు టెస్టుల్లో ఓపెనర్‌గా 2 వేల పరుగుల మైలురాయిని రోహిత్ అందుకున్నాడు.