LOADING...
IPL 2025 Team Of The Season:టీం ఆఫ్ ది సీజన్‌కు రోహిత్ శర్మ కెప్టెన్..? సిద్ధూపై నెటిజన్ల ఆగ్రహం!
టీం ఆఫ్ ది సీజన్‌కు రోహిత్ శర్మ కెప్టెన్..? సిద్ధూపై నెటిజన్ల ఆగ్రహం!

IPL 2025 Team Of The Season:టీం ఆఫ్ ది సీజన్‌కు రోహిత్ శర్మ కెప్టెన్..? సిద్ధూపై నెటిజన్ల ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ఓ ప్రత్యేక జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అతని నాయకత్వ నైపుణ్యాలు, బలమైన ట్రాక్ రికార్డును కొనియాడుతూ, ఇతరుల జట్లలో రోహిత్ లేనప్పటికీ తాను మాత్రం ఆయన్నే కెప్టెన్‌గా తీసుకున్నానని స్పష్టంగా చెప్పారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి చోటు కల్పించారు. మూడో, నాల్గో స్థానాల్లో వరుసగా జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చారు. ఐదో స్థానంలో నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలను జట్టులోకి తీసుకున్నారు.

Details

 స్పెషలిస్ట్ స్పిన్నర్ గా నూర్ అహ్మద్

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నూర్ అహ్మద్‌ను ఎంపిక చేయగా, పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, జోష్ హాజిల్‌వుడ్‌లను ఎంపిక చేశారు. అయితే సిద్ధూ ప్రకటించిన ఈ జట్టుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కొనసాగుతోంది. "ఇంతకీ ఈ కామెడీ ఏంటి? రోహిత్ ఏ జట్టుకీ కెప్టెన్ కాదు.. ఐపీఎల్ జట్టుకే ఎలా కెప్టెన్ అవుతాడు?" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ "హలో గురూజీ, రోహిత్ శర్మ అసలు ఐపీఎల్ 2025 టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో లేరని తెలిపారు. "ఇంతకైనా ఒకసారి ఐపీఎల్ మొత్తం చూశావా?" అంటూ సిద్ధూకి సూచనలు చేస్తూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

Details

నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపిక చేసిన IPL 2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ 

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్ గమనించదగ్గ విషయం ఏమిటంటే - ఈ జట్టులో ఆరెంజ్ క్యాప్ విజేత సాయి సుదర్శన్, గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు దక్కలేదు.