
Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో వాంఖడే స్టేడియంలో 100సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా ఆయన రికార్డు నెలకొల్పాడు.
ఈ ఘనతను రోహిత్ శర్మ గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు.
163పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ కేవలం 16బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు బాది 26పరుగులు సాధించాడు.
అతని స్ట్రైక్‌రేట్ 162.50గా ఉంది.ఇదే సందర్భంగా వాంఖడే స్టేడియంలో ఐపీఎల్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రోహిత్ చరిత్రలో నిలిచాడు.
అంతేకాకుండా,ఐపీఎల్‌లో ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు కొట్టిన నాలుగో ఆటగాడిగా కూడా రోహిత్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు
ఐపీఎల్ చరిత్రలో ఒకే మైదానంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రాయల ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నాడు.
అతడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 130 సిక్సర్లు బాదాడు. అతనికి తర్వాత వరుసగా క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లు ఉన్నారు.
ఐపీఎల్‌లో ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు ఇలా ఉన్నారు:
విరాట్ కోహ్లీ - చిన్నస్వామి స్టేడియంలో 130 సిక్సర్లు
క్రిస్ గేల్ - చిన్నస్వామి స్టేడియంలో 127 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్ - చిన్నస్వామి స్టేడియంలో 118 సిక్సర్లు
రోహిత్ శర్మ - వాంఖడే స్టేడియంలో 100 సిక్సర్లు
కీరన్ పొలార్డ్ - వాంఖడే స్టేడియంలో 85 సిక్సర్లు
వివరాలు
రెండు వికెట్లు తీసిన ముంబై బౌలర్ విల్ జాక్స్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 బౌండరీలతో 40 పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశారు.
ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీసి కీ ప్లేయర్‌గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.
వివరాలు
18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్
ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బ్యాటింగ్‌లో ర్యాన్ రికెల్టన్ 23 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేయగా, విల్ జాక్స్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశారు.
సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాంఖడే సిక్సర్ల కింగ్..
𝟮𝟱𝟬* Sixes for MI ✅
— Mumbai Indians (@mipaltan) April 17, 2025
𝟭𝟬𝟬* Sixes in #TATAIPL at Wankhede ✅
𝐎𝐍𝐄 & 𝐎𝐍𝐋𝐘 𝐑𝐎𝐇𝐈𝐓 𝐒𝐇𝐀𝐑𝐌𝐀 🔥#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/xYhpdJNzD0