IND vs PAK : రోహిత్ శర్మ కు గాయం.. ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్
క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8గంటలకు ఈ హైవోల్టేజ్ వార్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఆసక్తికర మ్యాచ్ ముంగిట టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి గాయపడ్డాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ గాయపడిన విషయం తెలిసిందే. లిటిల్ వేసిన బంతి రోహిత్ భుజానికి బలంగా తాకింది.అనంతరం రిటైర్ట్ హట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం హిట్ మ్యాన్ మాత్రం గాయం గురించి చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చాడు. మరోవైపు సుదీర్ఘంగా సాగే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌కు పాకిస్థాన్ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ మౌనం
రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్ పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియాకు అది తీవ్ర ప్రతికూలాంశమే. యూఎస్‌ఏలోని కఠిన పిచ్‌లపై ఈ గేమ్ ఛేంజర్ మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పగలడు. కాగా, హిట్‌మ్యాన్ గైర్హాజరీ అయితే జట్టు పగ్గాలను వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అందుకునే అవకాశాలూ ఉన్నాయి. అలాగే విరాట్ కోహ్లితో కలిసి యశస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు ఓపెనర్లుగా రోహిత్-కోహ్లి కలిసి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ గాయం కారణంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం అయితే అది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.