Rohit Sharma: బంగ్లాదేశ్‌తో మ్యాచుకు ముందు వివాదంలో రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో టీమిండియా(Team India) పోటీపడనుంది.
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచుకు ముందు పూణే ట్రాఫిక్ పోలీసులు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఊహించని షాక్ ఇచ్చారు.
ముంబై-పుణే మార్గంలో అతడి కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లడంతో పోలీసులు జరిమానా విధించారు.
ఓ దశలో రోహిత్ కారు అత్యధికంగా 215 కిలోమీటర్లు వెళ్లినట్లు సమాచారం.
వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంలో కారు వెళ్లినందుకు కారు యజమాని అయిన రోహిత్‌కు ట్రాఫిక్ పోలీసులు మూడు చలానాలు వేశారు.
Details
అద్భుత ఫామ్ లో రోహిత్ శర్మ
అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు 5 రోజులు విరామం దొరికింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ అహ్మదాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు.
ఇక రెండు రోజుల పాటు కుటుంబంతో గడిపిన రోహిత్, పూణేలో భారత జట్టుతో కలిసేందుకు ముంబై నుంచి తన లంబోర్గిని ఉరుస్ కారులో బయల్దేరాడు. దీంతో ముంబై-పూణే హైవేపై రోహిత్ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లాడు.
ఇక రోహిత్ కారును ఓ పోలీస్ ఉన్నతాధికారి అడ్డుకున్నాడట. పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని ఆ అధికారి సూచించినట్లు తెలిసింది.
ఈ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో మూడు మ్యాచులాడిన హిట్ మ్యాన్ 217 పరుగులు చేశాడు.