LOADING...
టెస్టుల్లో హిట్ మ్యాన్ ప్రభంజనం..  రోహిత్ ఖాతాలో పలు రికార్డులు 
ఓపెనర్‌గా రోహిత్ తన ఏడో టెస్టు శతకాన్ని సాధించాడు

టెస్టుల్లో హిట్ మ్యాన్ ప్రభంజనం..  రోహిత్ ఖాతాలో పలు రికార్డులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2023
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో పరుగుల వరద పాటిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో 221 బంతుల్లో 103 పరుగులు చేశాడు. మొదటి వికెట్‌కు యశస్వీ జైస్వాల్‌(143)తో కలిసి రోహిత్ శర్మ 229 పరుగులు జోడించాడు. దీంతో రోహిత్ టెస్టులో 10 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ తన తొలి టెస్టు క్యాప్ అందుకోవడానికి 2013 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అతను అరంగేట్రంలో మ్యాచులోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. తర్వాత 2019లో టెస్టు ఓపెనర్‌గా పదోన్నతి పొంది చక్కగా రాణించాడు. ప్రస్తుతం రోహిత్ కి ఓపెనర్ గా ఇది ఏడో టెస్టు సెంచరీ.

Details

టెస్టుల్లో రోహిత్ శర్మ సాధించిన రికార్డులివే

రోహిత్ ఓపెనర్‌గా 24 టెస్టుల్లో 52.83 సగటుతో 1,955 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. స్వదేశంలో రోహిత్ 15 టెస్టుల్లో ఓపెనర్‌గా 58.71 సగటుతో 1,233 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీని బాదాడు. రోహిత్ టెస్టు ఫర్మాట్లో 3,500 పరుగుల మార్క్‌ను దాటిన 20వ భారతీయ ప్లేయర్‌గా బ్యాటర్‌ నిలిచాడు. అతను మొత్తం 51 టెస్టుల్లో 45.97 సగటుతో 3,540 పరుగులు చేశాడు. 2019లో దక్షిణాఫ్రికాపై టెస్టు ఫార్మాట్‌లో రోహిత్ డబుల్ సెంచరీ చేసి చెలరేగిన విషయం తెలిసిందే. భారత్‌ తరఫున పది అంతకంటే ఎక్కువ టెస్టు సెంచరీలు చేసిన 17వ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.