Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. కేవలం 50 పరుగులే దూరం
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచేందుకు అతనికి కేవలం 50 పరుగులే అవసరం.
ఈ క్రమంలో, రోహిత్ శర్మ ఈ రికార్డును సాధిస్తే, లెజెండరీ బ్యాటర్ సచిన్ టెందూల్కర్‌ను అధిగమించనున్నాడు.
ప్రస్తుతం ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 321 మ్యాచ్‌ల్లో 15,758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ టెందూల్కర్ 346 మ్యాచ్‌ల్లో 15,335 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
Details
సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం
ఇక రోహిత్ శర్మ ఇప్పటివరకు 342 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 45.22 సగటుతో 15,285 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు వన్డేల్లో సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం రోహిత్‌కు ఉంది.
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో రోహిత్ కేవలం రెండు పరుగులకే ఔటయ్యాడు.
ఇటీవల అతని ఫామ్ అంతగా మెరుగ్గా లేకపోయినా త్వరలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హిట్‌మ్యాన్ జోరందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Details
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
1. సనత్ జయసూర్య - 19,298 పరుగులు
. క్రిస్ గేల్ - 18,867 పరుగులు
3. డేవిడ్ వార్నర్ - 18,744 పరుగులు
4. గ్రేమ్ స్మిత్ - 16,950 పరుగులు
5. డెస్మండ్ హేన్స్ - 16,120 పరుగులు
6. వీరేంద్ర సెహ్వాగ్ - 16,119 పరుగులు
7. సచిన్ టెందూల్కర్ - 15,335 పరుగులు
8. రోహిత్ శర్మ - 15,285 పరుగులు