కోహ్లి చూస్తుండగానే చాహల్‌ను వంగోపెట్టి బాదిన రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్-భారత్ రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డగౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ, చాహల్‌ను సరదాగా కొట్టాడు.
అదే సమయంలో పక్కనే విరాట్ కోహ్లి, జయదేవ్ ఉన్కదత్ ఉన్నారు. చాహల్‌ను రోహిత్ బాదుతుండగా వారు నవ్వుకున్నారు.
టీమిండియా సారథి రోహిత్ శర్మ మైదానం వెలుపల ఎంత సరదాగా, కూల్ గా ఉంటాడో మైదానంలో అంత వేడిగా కవిపిస్తాడు. ఈ మేరకు సహచరులపై గ్రౌండ్ లో చిర్రుబుర్రులాడు తుంటాడు.
ఫీల్డింగ్ సమయంలో ఎవరైనా పొరపాట్లు చేస్తే వారిపై రోహిత్ అరిచేస్తుంటాడనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను వీపు మీద పదే పదే రోహిత్ శర్మ కొడుతున్న సీన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చాహల్‌ను రోహిత్ బాదుతుండగా నవ్వుకున్న కోహ్లీ, జయదేవ్
Rohit Sharma and Chahal bond is the best and most funniest in the team. 😂pic.twitter.com/fuAQLDazgl
— Vishal. (@SPORTYVISHAL) July 30, 2023