Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు.. టీమిండియా మాజీ కెప్టెన్
భారత క్రికెట్ జట్టు, న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడిపోయింది. చరిత్రలో తొలిసారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 'వైట్‌వాష్'కు గురైంది. ఈ ఓటమి తర్వాత రోహిత్ శర్మ సేనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్లు, ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్‌లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా-భారత్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోతే, అది అతని కెరీర్‌లో చివరి టెస్టు అయ్యే అవకాశం ఉందని శ్రీకాంత్ అన్నారు. ఆస్ట్రేలియా జరిగే టెస్టుల్లో రోహిత్ విఫలమైతే, రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదే అని ఆయన సూచించారు.
రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా మరో క్రికెటర్ ని ఎంచుకోవాలి : శ్రీకాంత్
వయసు పెరుగుతోన్న రోహిత్, ఇప్పటికే టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారని, ఇక క్రికెట్‌లో రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయ ఓపెనర్‌ను సిద్ధం చేసుకోవాలని బీసీసీఐకి సూచించారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన ఇచ్చారు. విరాట్ కోహ్లీ 15.50 సగటుతో 93 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 15.16 సగటుతో 91 పరుగులు చేశారు. ఇక 36 ఏళ్ల విరాట్, 37 ఏళ్ల రోహిత్ త్వరలో ఆటకు వీడ్కోలు పలుకుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రోహిత్, విరాట్ విరాట్ రాణించకపోతే వారి భవిష్యత్తు కష్టంగా మారే అవకాశం ఉంటుంది.