Ceat Awards: రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు క్రికెట్ అత్యున్నత అవార్డులు ప్రధానం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌లకు క్రికెట్‌కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి. CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2023-24లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 'పురుషుల ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపిక అవ్వగా, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' లభించింది. భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 'పురుషుల వన్డే బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహమ్మద్ షమీని 'వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించారు.
స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో జే షా
దీంతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 712 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌కు 'పురుషుల టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్', అశ్విన్‌ను 'పురుషుల టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్'గా ప్రకటించారు. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు బీసీసీఐ సెక్రటరీ జే షాను సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు అందుకోవడంపై భారత జట్టు దృష్టి సారిస్తుందని జే షా తెలిపారు. న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీకి 'పురుషుల టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించగా, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ పొట్టి ఫార్మాట్‌లో 'బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. భారత మహిళా క్రికెటర్లు కూడా అనేక అవార్డులతో సత్కరించారు.
అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా
అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా: పురుషుల టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- యశస్వి జైస్వాల్ పురుషుల టెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్- రవిచంద్రన్ అశ్విన్ T20I బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్ - ఫిల్ సాల్ట్ ఉత్తమ T20I బౌలర్ ఆఫ్ ది ఇయర్-టిమ్ సౌతీ స్టార్ స్పోర్ట్స్ T20 లీడర్‌షిప్ అవార్డు- శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ కోసం అవార్డు-జే షా మహిళల T20I చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు - హర్మన్‌ప్రీత్ కౌర్ CEAT మహిళా భారత బౌలర్ ఆఫ్ ది ఇయర్-దీప్తి శర్మ మహిళల టెస్టులో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ - షెఫాలీ వర్మ