Rohit Sharma: RCBలో చేరాలని రోహిత్ శర్మకు అభ్యర్ధన.. భారత కెప్టెన్ రియాక్షన్ వైరల్!
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ (RTM) అవకాశాలను ఎలా వినియోగించుకుంటాయన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, గత సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పించబడిన రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ తిరిగి తీసుకుంటారా లేదా అనేది ఉత్కంఠ భరితమైన ప్రశ్నగా మారింది. ఈ పరిణామంలో, రోహిత్‌కు అభిమానుల నుంచి ప్రత్యక్షంగా ఓ విజ్ఞప్తి వచ్చింది, దానికి రోహిత్ ఇచ్చిన స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్నతొలి టెస్ట్ మ్యాచ్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే?
భారత జట్టు ఫీల్డింగ్ చేస్తుండగా,అభిమానులలో ఒకరు రోహిత్ శర్మను''నువ్వు ఐపీఎల్‌లో ఏ జట్టులో ఉండబోతున్నావు?'' అని ప్రశ్నించారు. దానికి రోహిత్ స్పందిస్తూ,''నీకు ఏమి కావాలో చెప్పు?''అని ప్రశ్నించాడు.ఆ ఫ్యాన్ వెంటనే ''నువ్వు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)జట్టులోకి రావాలి'' అని కోరాడు. ఈ మాటలు విన్న రోహిత్,చేతితో సిగ్నల్ చేసి నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఐదు సార్లు ముంబయి ఇండియన్స్ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్,వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతాడని ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు,ముంబయి ఇండియన్స్ రోహిత్‌ను రిటైన్ చేసుకోనుందనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఫ్రాంచైజీలు ఈ నెల 31లోపు తమ రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ కమిటీకి సమర్పించాల్సి ఉంది.