తదుపరి వార్తా కథనం

SRH vs MI : విజృంభించిన రోహిత్ శర్మ.. సన్‌రైజర్స్‌పై ముంబై గెలుపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 23, 2025
10:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను చేధించింది.
రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేసి ఆ జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, అన్సారీ, మలింగ తలా ఓ వికెట్ తీశారు.
అంతకుముందు సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏడు వికెట్ల తేడాతో ముంబై విజయం
Match 41. Mumbai Indians Won by 7 Wicket(s) https://t.co/nZaVdtxbj3 #SRHvMI #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 23, 2025