
పక్కా ప్రణాళికలతో వరల్డ్ కప్ బరిలోకి.. షెడ్యూల్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. టీమిండియా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.
2011లో ధోనిసేన చేసిన మ్యాజిక్ ను ఈసారి రోహిత్ సేన రిపీట్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండటంతో టీమిండియా ఫెవరేట్ గా బరిలోకి దిగుతోంది.
అయితే ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ఫై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో చాలా పోటీ ఉందని, ఆటలో వేగం పెరగడమే దీనికి కారణమని రోహిత్ పేర్కొన్నారు.
స్వదేశంలో జరగనున్న ఈ వరల్డ్ కప్ గెలిచి ఐసీసీ ట్రోఫీ తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
Details
వరల్డ్ కప్ గెలవడం సులభం కాదు : రోహిత్
క్రికెట్లో వేగం పెరగడం వల్ల వరల్డ్ కప్‌లో కూడా పోటీ తీవ్రంగా ఉందని, వరల్డ్ కప్ గెలవడం అంత సులభం కాదని, అయితే శక్తి మేరకు కష్టపడతామని, రౌండ్ రాబిన్ లీగ్‌లో మ్యాచులో ఆడనుండడంతో అన్ని జట్లపై ఒత్తిడి ఉంటుందని, స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండటంతో తమపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని రోహిత్‌శర్మ పేర్కొన్నారు.
మొత్తంగా ఈ టోర్నీలో 45 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. లీగ్ నుంచి టాప్ 4 జట్లు మాత్రమే సెమీస్ కు చేరుతాయి. నవంబర్ 15న ముంబైలో, నవంబర్ 16న కోల్ కతాలో రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.