
వెస్టిండీస్ టూరుకు అందుబాటలో రోహిత్ శర్మ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
ఈ వార్తాకథనం ఏంటి
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో టీమిండియా ప్రస్తుతం విరామం తీసుకుంటోంది. వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.
జూలై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో టీమిండియా, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.
ఈ పర్యటనకు టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే వారికి ఒక నెల రెస్ట్ సరిపోతుందని, రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లంతా వెస్టిండీస్ పర్యటనకు వెళ్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
గాయాలతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉంటారని తెలిపారు.
Details
టెస్టులకు, వన్డేలకు కెప్టెన్ గా రోహిత్ శర్మ
వెస్టిండీస్‌తో టెస్టులకు, వన్డేలకు రోహిత్ నాయకత్వం వహిస్తాడని, ఇక టీ20లకు హార్ధిక్ పాండ్యా సారథిగా కొనసాగుతాడని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
వచ్చేవారం సెలక్షన్ కమిటీ విండీస్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేయనుంది.
ప్రస్తుతం లండన్ టూరులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అక్కడ్నుంచే విండీస్ కు పయనం కానున్నారు. అయితే టీ20లకు రోహిత్, కోహ్లీలు దూరంగా ఉండనున్నారు.
ఇక టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్, ముకుశ్‌కుమార్‌లకు టెస్టు జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ సైతం టీ20లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.