
Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. ఒకే ఒక్క భారతీయుడిగా అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన రోహిత్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇది అతడి ఐపీఎల్ కెరీర్‌లో 20వ అవార్డు కావడం విశేషం. దీనితో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన భారతీయ క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి సీఎస్కే 176 పరుగులు చేసింది. జడేజా 53 పరుగులు (నాటౌట్), శివమ్ దూబే 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.
Details
76 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రోహిత్
లక్ష్యచేటికి దిగిన ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు (నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ కూడా 30 బంతుల్లో 68 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి అతడికి అద్భుతంగా సహకరించాడు.
వీరిద్దరి ఆత్మవిశ్వాసంతో ముంబై 15.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
Details
ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన భారత ఆటగాళ్లు
రోహిత్ శర్మ - 20 సార్లు
విరాట్ కోహ్లీ - 19 సార్లు
ఎంఎస్ ధోని - 18 సార్లు
ఐపీఎల్‌లో మొత్తం అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
1. ఏబీ డివిలియర్స్ - 25
2. క్రిస్ గేల్ - 22
3. రోహిత్ శర్మ - 20
4. విరాట్ కోహ్లీ - 19
5. డేవిడ్ వార్నర్ - 18
6. ఎంఎస్ ధోని - 18
Details
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా
ఈ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఎదిగాడు. శిఖర్ ధావన్‌ను అధిగమించి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇప్పటి వరకు ధావన్ 6769 పరుగులు చేయగా, రోహిత్ తన స్కోర్‌ను 6786కి చేర్చాడు.
1. విరాట్ కోహ్లీ - 8326 పరుగులు
2. రోహిత్ శర్మ - 6786 పరుగులు
3. శిఖర్ ధావన్ - 6769 పరుగులు
4. డేవిడ్ వార్నర్ - 6565 పరుగులు
5. సురేశ్ రైనా - 5528 పరుగులు