Page Loader
Kuldeep Yadav: రోహిత్ శర్మ స్థానం నాదే.. జడ్డూ కోసం ప్లేస్ మార్చా : కుల్దీప్
రోహిత్ శర్మ స్థానం నాదే.. జడ్డూ కోసం ప్లేస్ మార్చా : కుల్దీప్

Kuldeep Yadav: రోహిత్ శర్మ స్థానం నాదే.. జడ్డూ కోసం ప్లేస్ మార్చా : కుల్దీప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాడు రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులోనే కాదు, బస్సులో కూడా అతడి స్థానం ఖాళీ అయింది. తాజాగా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ స్థానం వద్దే తానే కూర్చుంటున్నానని వెల్లడించిన కుల్దీప్.. తాను అతడి స్థానాన్ని ఆక్రమించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. రోహిత్ భాయ్ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. కానీ ఇప్పుడు బస్సులో మాత్రం ఆ సీట్లో నేనే కూర్చుంటున్నా. ఎందుకంటే జడేజా భాయ్ పక్కన కూర్చొని ఎక్కువగా మాట్లాడాలని ఉంది.

Details

ఇంగ్లండ్ పిచ్ లపై రాణించని కుల్దీప్

అశ్విన్ లేనిపక్షంలో జడేజా వంటి అనుభవజ్ఞుడి నుంచి నేర్చుకోవడం నాకు ఎంతో ఉపయోగకరం. నా కెరీర్‌ ప్రారంభంలోనే వీరిద్దరితో ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడు జడేజా నా స్పిన్ పార్ట్‌నర్‌గా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఈ కాంబినేషన్‌ని నేను ఆస్వాదిస్తున్నానని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై ఇప్పటి వరకూ కుల్దీప్‌ పెద్దగా అనుభవం పొందలేకపోయాడు. 2018లో ఒక్క టెస్టులోనే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో తొమ్మిది ఓవర్లు వేసిన అతడు ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.

Details

సీనియర్లు లేకుండానే బరిలోకి భారత జట్టు

విదేశీ టెస్టుల్లో అవకాశం రాకపోవడంతో కుల్దీప్ మళ్లీ ఇంగ్లండ్‌లో మెరుపు చూపించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. మరోవైపు అశ్విన్ రిటైర్మెంట్‌తో అతడికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20న లీడ్స్‌లో ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్లు లేకుండానే టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. దీంతో మేనేజ్‌మెంట్ ఎలాంటి తుది జట్టును ఎంపిక చేస్తుందనేది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కి సారథ్యం వహించనున్నాడు.