అత్యంత అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది. మొదటి వన్డేకి కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదు. ఈ వన్డే సిరీస్‌లో హిట్ మ్యాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది.
వన్డేలో 10వేల పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ 218 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మకు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఈ వన్డే సిరీస్ లో ఈ ఫీట్ ను అందుకొనే అవకాశం ఉన్నట్లు అభిమానులు చెబుతున్నారు.
రోహిత్ స్వదేశంలో 77 వన్డేలు ఆడి 4,024 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ సాధించిన రికార్డులివే
రోహిత్ శర్మ ఆ మైలురాయిని సాధిస్తే వన్డేలో 10వేలు పరుగులు చేసిన 15వ టీమిండియా ప్లేయర్ గా రికార్డు సృష్టించనున్నాడు. సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లి (12,809), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889) ఎంఎస్ ధోనీ (10,773) పరుగులతో రోహిత్ కంటే ముందు స్థానంలో ఉన్నారు.
రోహిత్ 241 వన్డేల్లో 48.91 సగటుతో 9,782 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలున్నాయి.
24 వన్డేలకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించి 1,120 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా రోహిత్ 156 వన్డేల్లో 7,764 పరుగులు చేశాడు.