Page Loader
Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే 
Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే

Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే 

వ్రాసిన వారు Stalin
Dec 16, 2023
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఇండియన్స్ అనుకున్నట్లుగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి యాజమాన్యం ఎందుకు తప్పించింది? హార్దిక్ పాండ్యాను ఎందుకు నియమించింది.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ చివరగా 2020లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన అంటే 2021, 2022లో MI ప్లేఆఫ్‌లకు కూడా అర్హత సాధించలేకపోయింది. 2023 జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించినా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

ముంబై 

టీమిండియా కెప్టెన్ అయ్యాక.. 

రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచి.. టీమిండియా ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోవలేదు. దీని ప్రభావం ముంబై ఇండియన్స్‌పై కూడా కనిపించింది. రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక.. ముంబై ఇండియన్స్ ఒక్క టైటిల్ గెలవలేకపోయింది. రోహిత్ శర్మ రికార్డు విషయానికొస్తే.. టీ-20 ఫార్మాట్‌లో ఎక్కువ పరుగులు చేయలేకపోతున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతని రికార్డు కూడా అంత గొప్పగా లేదు. గత మూడు సీజన్లలో ఐపీఎల్‌లో అంతగా రాణించలేకపోతున్నాడు. రోహిత్ శర్మ వయస్సు ప్రస్తుతం 36ఏళ్లు. వయసు ఫ్యాక్టర్ కూడా రోహిత్‌ను తప్పించడానికి కారణంగా తెలుస్తోంది. అందుకే రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించాలని MI యాజమాన్యం భావించినట్లు తెలుస్తోంది.

ముంబై

పాండ్యాను ఎందుకు నియమించిందంటే.. 

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ప్రత్యేకంగా ముంబై ఇండియన్స్‌కు తీసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా తొలిసారి గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా మార్చాడు. తన కెప్టెన్సీలో రెండో సీజన్‌లో కూడా తన జట్టును కూడా ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. పాండ్యా 2022-23లో గుజరాత్ టైటాన్స్ తరఫున 37.8సగటుతో 833పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 133కంటే ఎక్కువగా ఉంది. అంతేకాదు 11వికెట్లు కూడా తీశాడు. ఇందులో అతని ఆరు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో కూడా పాండ్యా ప్రదర్శన నిలకడగా ఉంది. పాండ్యా వయస్సు ప్రస్తుతం 30ఏళ్లు మాత్రమే.. అందుకే మరి కొన్నేళ్ల పాటు పాండ్యా జట్టును నడపించడానికి అవకాశం ఉంటుంది.