LOADING...
Rohit Sharma: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్‌ హోదా
టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్‌ హోదా

Rohit Sharma: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్‌ హోదా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా లభించింది. క్రికెట్‌లో అతని నాయకత్వ నైపుణ్యాలు, ఆటలో చేసిన అసమాన సేవలకు గుర్తింపు రూపంలో అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మను డాక్టరేట్‌తో సత్కరించింది. బుధవారం జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో యూనివర్సిటీ హిట్‌మ్యాన్‌కు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. యూనివర్సిటీ ఒక ప్రకటనలో, "'క్రికెట్‌లో అభిమానులకు రోహిత్ శర్మ ఎల్లప్పుడూ హిట్‌మ్యాన్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఈ డాక్టరేట్ అతని కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుంది' అని పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రోహిత్‌కు డాక్టరేట్

Advertisement