Rohit Sharma: 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్' కెప్టెన్ గా రోహిత్ శర్మ.. టీంలో 6మంది భారతీయులకు చోటు
2023 సంవత్సరానికి ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఈ టీంలో టీమిండియాకి సంబంధించిన ఆరుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఈ ఎలైట్ టీమ్‌కు కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తున్నది మరెవరో కాదు, తన అసాధారణమైన నాయకత్వం, బ్యాటింగ్ నైపుణ్యాలతో క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న రోహిత్ శర్మ. ఏడాది పొడవునా, రోహిత్ 52 సగటుతో 1255 పరుగులు సాధించాడు. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌పై 131 పరుగులు బాదాడు.
ప్రపంచ కప్ లో సచిన్ సెంచరీల రికార్డును బద్దలుకొట్టిన విరాట్
ఇక,విరాట్ కోహ్లి గత సంవత్సరంలో తన స్థిరమైన ఆటతో ఆరు సెంచరీలతో సహా 1377 పరుగులు చేశాడు. 2023లో ప్రపంచ కప్ లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలుకొట్టి ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ జట్టులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలు చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియాల నుంచి ఏకంగా 8 మంది ఐసీసీ జట్టుకు ఎంపిక అయ్యారు.
ICC's ODI Team of the Year:
రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (డబ్ల్యుకె), మార్కో జాన్సెన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ