రోహిత్ సరసన సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ సాధించలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు చేసి చెలరేగిన విషయం తెలిసిందే. మొదటి టెస్టులో సెంచరీ, ఇప్పుడు రెండో టెస్టులో రెండు హాఫ్ సెంచరీలు క్రియేట్ చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా 30 ఇన్నింగ్స్‌లో డబుల్ డిజిట్ స్కోరు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే పేరిట ఉంది. జయవర్దనే వరుసగా 29 ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోరును నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు.
రోహిత్ సాధించిన రికార్డులివే
రోహిత్ గత 30 ఇన్నింగ్స్ ల్లో 1401 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ వరుసగా 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 31, 5, 3, 3, 3, 3, 3 103, 80, 57 స్కోర్లు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ కేవలం 35 బంతుల్లోనే తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని రెండో టెస్టులో నమోదు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఓపెనర్ గా 2వేల పరుగులను పూర్తి చేశాడు.రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ నెగ్గాలంటే 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.