Page Loader
Cristiano Ronaldo : యూట్యూబ్‌లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు
యూట్యూబ్‌లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు

Cristiano Ronaldo : యూట్యూబ్‌లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2024
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్చగల్ చెందిన ఈ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ తన ఆటతో కోట్లాదిమంది అభిమానులకు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా మరోసారి ఒక కొత్త రికార్డును నెలకొల్పాడు. రొనాల్డ్ ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్ స్కైబర్లు వచ్చారు. దీంతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఛానల్‌గా వరల్డ్ రికార్డు సాధించింది.

Details

19 వీడియోలను పోస్టు చేసిన రొనాల్డ్

సగం రోజులోనే ఆ సంఖ్య కోటి(13 మిలియన్లు) దాటేయడం విశేషం. ఇందులో రొనాల్డ్ 19 వీడియోలను పోస్టు చేశారు. రొనాల్డో 'ఎక్స్‌' ప్లాట్‌ఫామ్‌ ఖాతాకు 112.5 మిలియన్లు (11కోట్లకుపైగా), ఫేస్‌బుక్‌కు 170 మిలియన్లు (17 కోట్లు), ఇన్‌స్టాగ్రామ్‌కు 636 మిలియన్లు (63.6 కోట్లు) ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా యూట్యూబ్‌లో అతను రికార్డులను సృష్టిస్తున్నారు. తన కొత్త యూట్యూబ్ ఛానల్‌లో వెయిటింగ్ ముగిసిందని, నా ఛానల్ అందరూ సబ్‌స్క్రైబ్‌ చేసుకొండి అంటూ రొనాల్డ్ క్యాప్షన్ ఇచ్చాడు. ఫుట్‌బాల్, ఫ్యామిలీ, న్యూట్రీషన్, ఎడ్యుకేషన్, బిజినెస్ విషయాలను పంచుకుంటానని ఆయన తెలిపారు.