పాకిస్తాన్ లీగ్‌లో దంచికొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్ రూసో
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ రూసో విధ్వంసం సృష్టించాడు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ 20 ఓవర్లలో 242 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ముల్తాన్ సుల్తాన్స్ చేధించి పెషావర్ కు జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రూసో పీఎస్ఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. కేవలం 51 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, 12 ఫోర్లతో 121 రన్స్ చేశాడు. 17 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ మార్కును 43 బాల్స్‌లో సెంచరీ మైలురాయిని అందుకున్నాడు.
హాఫ్ సెంచరీతో రాణించిన పోలార్డ్
టీ20 లీగ్ చరిత్రలో ఓ టీమ్ ఛేదించిన హయ్యెస్ట్ సెకండ్ టార్గెట్ ఇదే కావడం గమనార్హం. పెషావర్ సారిథి బాబర్ ఆజమ్(73)కు తోడు సయీబ్ అయూబ్ (58) రాణించారు. వన్‌డౌన్‌లో వచ్చిన మహ్మద్ హరీస్ (35), కొహ్లర్ (38) లు ఫర్వాలేదనిపించారు. ఫలితంగా ఆ జట్టు ముల్తాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది. లక్ష్య చేధనకు దిగిన ముల్తాన్‌కు అదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మసూద్ (5), మహ్మద్ రిజ్వాన్ (7) లు వెంటవెంటేనే పెవిలియన్ చేరారు. అనంతరం రూసో.. కీరన్ పొలార్డ్(52)తో కలిసి మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించాడు. తర్వాత పొలార్డ్ నిష్క్రమించినా రూసో చివరి నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.