IPL 2024 RCB VS KKR: స్వదేశంలో..సంచలనం నమోదు చేస్తారా?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇప్పటికే, కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించగా.. ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌పై గెలిచి నూతనోత్సాహంతో ఉంది. ఇప్పటివరకు RCB,KKR మొత్తంగా 32మ్యాచ్ ల్లో తలపడగా కోల్‌కతా నైట్ రైడర్స్ 18మ్యాచ్ లు , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఇక,బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,7-4 తో వెనక పడి ఉంది. IPLలోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ(49)KKRపై చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరోవైపు సొంత మైదానంలో KKRపై 2015 తర్వాత ఆర్సీబీ విజయం సాధించలేకపోయింది.మరి ఈ మ్యాచులో గెలిచి పరాజయాలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.
జట్టులు అంచనా :-
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (డబ్ల్యూకే), మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ