WPL 2024: ఉమెన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన RCB .. లేడీ కోహ్లీకి కింగ్ కోహ్లీ వీడియో కాల్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్2024 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
ఢిల్లీని 113పరుగులకు ఆలౌట్ చేసిన RCB 19.2ఓవర్లలో 2వికెట్ల నష్ఠానికి 115 పరుగులు చేసి విజయం సాధించింది.
113పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 19.3ఓవర్లలోనే ఛేదించింది.
జట్టు తరపున ఎల్లిస్ పెర్రీ అత్యధికంగా 35 పరుగులు చేసింది. స్మృతి మంథన 31 పరుగులు చేయగా, సోమి డివైన్ 32 పరుగులు చేశారు. విన్నింగ్ ఫోర్ కొట్టిన రిచా ఘోష్ 17 పరుగులు చేసింది.
ఢిల్లీ తరఫున శిఖా పాండే 1 వికెట్,మిన్ను మణి 1 వికెట్ తీశారు. 16ఏళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు చేయలేని పనిని మహిళల జట్టు చేసింది.
Details
వీడియో కాల్ చేసిన విరాట్ కోహ్లీ
అంతకముందు, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు కేవలం 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది.
RCB బౌలర్ సోఫీ మోలినక్స్ ఒకే ఓవర్‌లో ఢిల్లీ టాప్ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసింది.
ఇందులో షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్‌ల వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు తీసింది. ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టింది.
ఢిల్లీ తరపున షెఫాలీ వర్మ అత్యధికంగా 44 పరుగులు చేయగా, మెగ్ లానింగ్ 23 పరుగులు చేసింది.
RCB జట్టు గెలవగానే పురుషుల జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంథానకు వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
2024 ఉమెన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన RCB
#TATAWPL 2024 comes to a close! @bangalore sign off the season with a 🏆#DCvRCB | #Final | @RCBTweets pic.twitter.com/eqM4R955oi
— Women's Premier League (WPL) (@wplt20) March 17, 2024
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియో కాల్ చేసిన కోహ్లీ వీడియో ఇదే
𝗗𝗼 𝗡𝗼𝘁 𝗠𝗶𝘀𝘀!
— Women's Premier League (WPL) (@wplt20) March 17, 2024
Smriti Mandhana 🤝 Virat Kohli
A special phone call right after the #TATAWPL Triumph! 🏆 ☺️@mandhana_smriti | @imVkohli | @RCBTweets | #Final | #DCvRCB pic.twitter.com/Ee5CDjrRix