
RCB Vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై 11 పరుగులతో ఆర్సీబీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓడించింది.
206 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగుల వద్దే నిలిచింది.
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైశ్వాల్ 49 పరుగులు, ధ్రువ్ జురెల్ 47 పరుగులు,నితిష్ రాణా 28 పరుగులు, రియాన్ పరాగ్ 22 పరుగులతో జట్టుకు తోడ్పాటు అందించారు.
కానీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో జట్టు విజయానికి దూరంలో నిలిచింది.
వివరాలు
పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి ఆర్సీబీ
ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శించి 4 వికెట్లు పడగొట్టాడు.
అతనితో పాటు కృనాల్ పాండ్య 2 వికెట్లు తీసినప్పటికీ కీలక సమయంలో మెరుగైన ప్రదర్శన చేశాడు.
యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ ఒక్కో వికెట్ చొప్పున సాధించారు.
ఇంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి వెళ్ళింది.