LOADING...
LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..క్వాలిఫయర్‌-1కు ఆర్సీబీ 
లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..క్వాలిఫయర్‌-1కు ఆర్సీబీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
11:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయంతో క్వాలిఫయర్-1కు చేరుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో పంత్‌ శతకం నమోదు చేస్తూ 118 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు వద్ద నిలిపాడు. ఆ తరువాత భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన బెంగళూరు జట్టు, 18.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేధించింది.

వివరాలు 

ఈనెల 29న ఆర్సీబీ తో పంజాబ్ కింగ్స్‌

జితేశ్ శర్మ అజేయంగా 85 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక, విరాట్ కోహ్లీ 54 పరుగులు, మయాంక్ అగర్వాల్ అజేయంగా 41 పరుగులుతో చెలరేగారు. ఈ విజయంతో లీగ్ దశకు ముగింపు పలికింది. రానున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఈనెల 29న ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు