Page Loader
SRH Playing XI: రూ.10 కోట్ల ప్లేయర్ ఔట్..? ముంబైపై కీలక నిర్ణయం తీసుకున్న సన్‌రైజర్స్!
రూ.10 కోట్ల ప్లేయర్ ఔట్..? ముంబైపై కీలక నిర్ణయం తీసుకున్న సన్‌రైజర్స్!

SRH Playing XI: రూ.10 కోట్ల ప్లేయర్ ఔట్..? ముంబైపై కీలక నిర్ణయం తీసుకున్న సన్‌రైజర్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రివెంజ్ మిషన్‌కి సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓడిన సన్‌రైజర్స్, ఇప్పుడు అదే జట్టుతో ఉప్పల్‌లో తిరిగి ఢీకొట్టనుంది. బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుండగా, గెలుపుతోనే ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఆరెంజ్ ఆర్మీ బరిలోకి దిగబోతోంది. హోమ్ గ్రౌండ్ ఆధిక్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో ముంబైకి చుక్కలు చూపించాలని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న ముంబయి ఇండియన్స్ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. రోహిత్ ఫామ్‌లోకి రావడం, ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతున్న అంశాలు.

Details

రూ. 10 కోట్ల ప్లేయర్‌పై వేటు ఉంటుందా?

విజయాలు రాకపోవడంతో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లపై విపరీతమైన ఆధారపడటమే సమస్యగా మారింది. వీరిలో ఒకరు ఫెయిల్ అయితే మ్యాచ్ పూర్తిగా జట్టు చేతుల నుంచి జారిపోతుంది. ఇక బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ అనూహ్యంగా పేలవంగా ప్రదర్శిస్తూ జట్టుకు నష్టం తెస్తున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిల వైఫల్యం కూడా ఆరెంజ్ ఆర్మీపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. ఈ ముగ్గురి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తుండగా, వారిని తుది జట్టులో నుంచి తప్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

Details

షమీ స్థానంలో జయదేవ్ ఉనాద్కత్

అయితే సమస్య ఏంటంటే వారి స్థానాలను భర్తీ చేయగల బలమైన ప్రత్యామ్నాయాలు లేవు. భారీ ధరలకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) పూర్తిగా ఫెయిల్ అవుతూ జట్టు ఆశలు నెరవేర్చడంలో విఫలమయ్యారు. జయదేవ్ ఉనాద్కత్ జట్టులో ఉన్నా అతను షమీ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేస్తాడా అన్నది అనుమానమే.

Details

ఇంపాక్ట్ ప్లేయర్‌లో మార్పే ఏకైక మార్గం?

తుది జట్టులో పెద్దగా మార్పులు చేయలేని పరిస్థితి సన్‌రైజర్స్‌కు ఎదురవుతోంది. గడిచిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాహుల్ చాహర్ ఆడినా, అతనిలో పెద్దగా ప్రభావం కనిపించలేదు. రాబోయే మ్యాచ్‌లో అభినవ్ మనోహర్ లేదా స్మరన్ రవిచంద్రన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ బాధ్యతలు చేపడతారు. ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మిడిలార్డర్‌ను భర్తీ చేస్తారు. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టాప్ ఆర్డర్ మెరుపులు చూపాల్సిందే. లేదంటే మరో ఓటమి సన్‌రైజర్స్‌ను ప్లే ఆఫ్స్ దిశగా దూరం చేసే ప్రమాదం ఉంది.