Cricker News : ఆండ్రూ రసెల్ విధ్వంసం.. ఖవాజా బూట్లపై వివాదం... టీ20ల్లో శ్రేయస్, బిష్ణోణ్ ఎందుకు లేరు?
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా విండీస్ ఆటగాడు అండ్రూ రసెల్((Andre Russell) దాదాపు రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ దూరమయ్యాడు.
తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అతను జట్టులో చేరాడు. తొలి మ్యాచులో ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.
బౌలింగ్ లో మూడు వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 29 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 171 పరుగులకు ఆలౌటైంది.
లక్ష్య చేధనలో వెస్టిండీస్ 18.1 ఓవర్లలో 172 పరుగులు చేసి విజయం సాధించింది.
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) చిక్కుల్లో పడ్డాడు.
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ లో భాగంగా ఆసీస్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించింది.
Details
ప్రశ్నల వర్షం కురిపించిన ఆకాశ్ చోప్రా
ఖవాజా తాను ధరించిన బూట్లపై స్వేచ్ఛ అనేది అందరి మానవహక్కు అని, అందరూ సమానమే అంటూ రాసినట్లు ఉంది.
ఆసీస్ ఆటగాళ్లు ఐసీసీ(ICC) నిబంధనలు పాటించాల్సి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20ల్లో రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్ ఆడలేదు.
దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురింపించాడు.
అయ్యర్, బిష్ణోయ్ ఎందుకు ఆడటం లేదో ఎవరికైనా తెలుసా అని, శ్రేయస్ గత సిరీస్ లో వైస్ కెప్టెన్ అని తాను ఏదో మిస్ అయినట్లు అనిపించిందని ఆకాశ్ ట్విట్ చేశారు.