Page Loader
ఓపెన్ మాస్టర్స్ సిరీస్‌లో విజేతగా నిలిచి రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్
హోల్గర్ రూనెపై విజయం సాధించిన ఆండ్రీ రుబ్లేవ్

ఓపెన్ మాస్టర్స్ సిరీస్‌లో విజేతగా నిలిచి రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోంటాకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నీ రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్ సంచలనం సృష్టించాడు. మొకాకోలో ఆదివారం జరిగిన పురుషుల సింగల్స్ ఫైనల్‌లో తొమ్మిది ర్యాంకర్ హోల్గర్ రూనె పై విజయం సాధించాడు. హోల్గర్ రూనెను 5-7, 6-2, 7-5‌తో ప్రపంచ ఆరో ర్యాంకర్ రుబ్లేవ్ చిత్తు చేశాడు. ఈ విజయంలో రుబ్లేవ్ అరుదైన ఘనతను సాధించారు. తన కెరీర్‌లో తొలి మాస్టర్స్ టైటిల్ గెలచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

రుబ్లేవ్

రుబ్లేవ్‌కు రూ.8 కోట్లు ప్రైజ్‌మనీ

ఈ మ్యాచ్‌లో మూడో సెట్‌లో రుబ్లేవ్ 1-4 వెనుకబడ్డాయి. అయితే అనూహ్యంగా తర్వాతి సెట్లో చెలరేగి ఆడాడు. ఈ విజయంలో రుబ్లేవ్ 1000 ర్యాకింగ్ పాయింట్ల లభించడం విశేషం విజేత రుబ్లేవ్ కు రూ.8,92,590 యూరోల అంటే రూ. 8 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. ఈ విజయం తనకు దక్కడంపై రుబ్లేవ్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలను సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.