తదుపరి వార్తా కథనం

CSK: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 21, 2024
04:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
కెప్టెన్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను నియమించింది. కాగా, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త కెప్టెన్ అంటూ ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.
తాజాగా,ఐపీఎల్ 2024 ట్రోఫీతో 10జట్ల కెప్టెన్ లు ఇచ్చిన ఫోటో షూట్ లో ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ వచ్చారు.
రుతురాజ్ 2020లో తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరుపున అతను 52 మ్యాచ్‌లలో 39.07 సగటుతో, 135.52 స్ట్రైక్ రేట్‌తో 1797 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చేసిన ట్వీట్
Presenting @ChennaiIPL's Captain - @Ruutu1331 🙌🙌#TATAIPL pic.twitter.com/vt77cWXyBI
— IndianPremierLeague (@IPL) March 21, 2024