Chennai Vs Punjab: పంజాబ్ తో ఓటమికి కారణం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ .. ఇది జట్టుతో అసలు సమస్య
పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది. IPL 2024లో CSK ఐదో ఓటమిని చవిచూసింది. దీని వెనుక అసలు కారణాన్ని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. పంజాబ్‌పై ఓటమి వెనుక రెండు కారణాలను చెప్పాడు. రుతురాజ్ గైక్వాడ్ తన జట్టు చాలా తక్కువ పరుగులు చేసిందని, ఆపై బౌలర్ల కొరత కారణంగా జట్టు కష్టాల్లో కూరుకుపోయిందని అంగీకరించాడు. దీపక్ చాహర్ మొదటి ఓవర్ కూడా వేయలేకపోయాడు. తుషార్ దేశ్‌పాండే, మతిషా పతిరానా ఫిట్‌గా లేనందున వారు ప్లేయింగ్ ఎలెవన్'లోలేరని తెలిపాడు.
మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
'కనీసం మరో 60 పరుగుల వరకు అదనంగా చేయాల్సింది. మా బ్యాటింగ్ అప్పుడు పిచ్ నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మతీశా పతిరన, తుషార్ దేశ్‌పాండే లేకపోవడం కూడా ఒకరకంగా నష్టం చేసింది. వికెట్ కావాల్సిన సమయంలో కేవలం ఇద్దరు పేసర్లతోనే బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి. మంచు ప్రభావం వల్ల స్పిన్నర్లకు బంతిపై కంట్రోల్ ఉండదు. వారి నుంచి ఎక్కువగా ఆశించకూడదు. గత మ్యాచ్‌లోనూ మేం భారీ తేడాతో (78 పరుగులు) హైదరాబాద్‌పై గెలవడం కూడా మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తేమను మనం నియంత్రించలేము. మొదటి బ్యాటింగ్ చేసినప్పుడే ఇంకాస్త బెటర్‌గా బ్యాటింగ్ చేస్తే బాగుండేది.
టాస్ కూడా కలిసి రావాలి: రుతరాజ్
అంతకుముందు రెండు మ్యాచుల్లో మేం 200+ స్కోరును చేసి ప్రత్యర్థి ముందు ఉంచాం. ఈ మ్యాచ్‌లో కనీసం 180 రన్స్ చేసినా ప్రత్యర్థికి టార్గెట్ ఛేదించడం కొంచెం క్లిష్టంగా మారేది. టాస్ కూడా కలిసి రావాలి. అందుకోసం నేను టాస్ వేయడాన్ని కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేశా. అక్కడ కొన్నిసార్లు విజయవంతమయ్యా. ఇక్కడ మాత్రం అనుకూలంగా రాలేదు. గేమ్‌లో పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ టాస్ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యా'' అని రుతురాజ్ వెల్లడించాడు.