David Warner: అరుదైన ఘనతను సాధించిన డేవిడ్ వార్నర్
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఐదు మ్యాచుల వన్డే సిరీస్ ను ఆడుతోంది. ఈ సిరిస్ మొదటి రెండు పోటీల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 111 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 56 బంతులో 78 పరుగులు చేసి అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాపై డేవిడ్ వార్నర్ 45.80 సగటుతో 1,191 పరుగులు చేసి, ఆస్ట్రేలియా తరుఫున అత్యధిక స్కోరు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు రికీ పాంటింగ్ (1,879), స్టీవ్ వా (1,581) ఉన్నారు.
ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం
145 వన్డేల్లో వార్నర్ 45.35 సగటుతో 6,214 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 338/6 భారీ స్కోరు చేసింది. క్వింటన్ డి కాక్ (82) కెప్టెన్ టెంబా బావుమా (57) ఐడెన్ మార్క్రామ్ (102) సెంచరీతో చేలరేగారు. లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 34.3 ఓవర్లలో 227 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచులో సెంచరీతో చెలరేగిన అడమ్ మార్క్రామ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.