IND Vs SA : సౌతాఫ్రికాతో భారత్ మూడో టీ20.. పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో టీ20 టీమిండియా(Team India) సిద్ధమైంది. మొదట మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20ల్లో భారత్ ఓటమిపాలైంది.
దీంతో సిరీస్‌ను కాపాడుకోవాలంటే చివరిదైన మూడో టీ20 మ్యాచులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్ బ్యాటర్లు బాగానే రాణిస్తున్నా, బౌలర్లు మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.
చివరి టీ20ల్లో నెగ్గాలంటే భారత బౌలర్లు సత్తా చాటాల్సిన అవసరముంది.
ఈ నేపథ్యంలో జోహన్నెస్‌బర్గ్ స్టేడియం పిచ్ రిపోర్టు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.
గత రెండు మ్యాచుల్లో వర్షం ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అయితే జోహాన్నెస్‌బర్గ్ వర్షం పడే అవకాశాలు లేవు.
Details
ఇరు జట్లలోని సభ్యులు
ఈ మైదానంలో బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
జోహాన్నెస్‌బర్గ్ స్టేడియంలో పది టీ20 మ్యాచులు జరగ్గా, ఇందులో ఛేజింగ్ జట్లు ఏడుసార్లు గెలుపొందాయి.
దక్షిణాఫ్రికా జట్టు
రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (WK), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, నాండ్రే బర్గర్, లిజాడ్ విలియమ్స్, తబ్రైజ్ షమ్సీ, ఒట్నీల్ బార్ట్‌మన్.
భారత జట్టు
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), రింకు సింగ్, జితేష్ శర్మ (WK), రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్.