స్పెషల్ డే సందర్భంగా సచిన్ 'హిందీ'లో ప్రశ్నలు.. కుల్దీప్ బెస్ట్ అంటూ మాజీ క్రికెటర్ ప్రశంసలు
టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో రారాజుగా ఎదిగాడు. తనకంటూ క్రికెట్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సచిన్, క్రికెట్‌తో పాటు వివిధ అంశాలపై పోస్టులు పెడుతుంటారు. తాజాగా హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సరదాగా అభిమానులకు నాలుగు ప్రశ్నలు అడిగాడు. అంపైర్, వికెట్ కీపర్, ఫీల్డర్, హెల్మెట్ ను హిందీలో ఏమని పిలుస్తారని ప్రశ్నించగా, నెటిజన్లు సమాధానాలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్
టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. అతని గణాంకాలు చాలా బాగున్నాయని, నిలకడగా వికెట్లు పడగొడుతూ టీమిండియా తరుఫున అద్భుతంగా రాణిస్తున్నాడని ఆయన కొనియాడారు. పాకిస్థాన్ జట్టుపై ఐదు వికెట్లు పడగొట్టిన కుల్దీప్, శ్రీలంకతో జరిగిన మ్యాచులో నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.