Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో సంగీత్ హ్యాట్రిక్ గోల్స్.. సింగపూర్‌ను చిత్తు చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా గేమ్స్ 2023లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుతోంది.
బుధవారం జరిగిన తొలి పూల్-ఏ మ్యాచులో భారత మహిళల హాకీ జట్టు 13-0 తో సింగపూర్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.
యువ స్ట్రైకర్ సంగీతా కుమారి హ్యాట్రిక్ గోల్స్ అదరగొట్టింది.
సంగీత (23వ, 47వ, 56వ ని.) మూడు గోల్స్ చేయగా, నవనీత్ కౌర్ 14వ నిమిషంలో రెండుసార్లు గోల్ చేసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఇక భారత్ తర్వాతి మ్యాచులో శుక్రవారం మలేషియాతో తలపడనుంది.
Details
అగ్రస్థానంలో నిలిచేందుకు కృషి
సింగపూర్ పై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, సీనియర్లు బాగా రాణించడంతో తమ పని సులభతరం అయిందని మ్యాచ్ తర్వాత స్కిపర్ సవిత పేర్నొన్నారు.
తాము ఇక్కడ మ్యాచ్-బై-మ్యాచ్ తీసుకుంటున్నామని, ఇక తర్వాతి మ్యాచ్ పై దృష్టి సారిస్తామని, తాము పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పారు.
తమ పూల్‌లో కొరియా కూడా ఉందని, ఆ జట్టుపై గెలిచి పూల్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తామని ఆమె పేర్కొన్నారు.