Page Loader
ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన సంజు శాంసన్
సన్‌రైజర్స్‌పై 700 పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా సంజుశాంసన్

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన సంజు శాంసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2023
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదారాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్‌పై ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ఓవరాల్‌గా సన్ రైజర్స్ పై 700 పైగా పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. సంజు శాంసన్ సన్ రైజర్స్ పై 725 పైగా పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 569, షేన్ వాట్సన్ 566, ఏబీ డివిలియర్స్ 540 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

చాహెల్

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహెల్

సన్ రైజర్స్ పై శాంసన్ ఇప్పటికే ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. గతంలో సెంచరీని ఉప్పల్ స్టేడియంలో శాంసన్ నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన యుజేంద్ర చాహెల్.. టీ20ల్లో (300) అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 203 పరుగులు చేయగా.. హైదరాబాద్ 131 పరుగులు చేసి ఓడిపోయింది.