T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్‌కీపర్-బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు.
Details
మరోసారి సెంచరీ మిస్
అయితే దురదృష్టవశాత్తూ సంజూ మరోసారి సెంచరీకి చేరువలోనే ఆగిపోయాడు. వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభానికి ముందు ఫామ్‌లేమితో బాధపడిన సంజూ, ఓపెనర్‌గా జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఆ సమయంలో టీ20 ఓపెనర్, వికెట్‌కీపర్‌గా ఇషాన్ కిషన్ అతడి స్థానాన్ని భర్తీ చేసి మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇదిలా ఉండగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కావడంతో సంజూకు తొలిసారి ఈ వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకున్న సంజూ 15 బంతుల్లో 24పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Details
అజేయంగా 97 పరుగులు
అయినప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజూ అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌కు విజయం అందించి జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే అక్కడ కూడా మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
Details
8 ఫోర్లు, 7 సిక్సర్లతో దుమ్మురేపిన సంజూ
తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లోనూ సంజూ శతకాన్ని అందుకోలేకపోయాడు. భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సంజూ, ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 42 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి సెంచరీకి కేవలం 11 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.
Details
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
అనంతరం శివమ్ దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించి జట్టు స్కోరును భారీగా పెంచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో సిక్సర్ కొట్టడంతో సంజూ శాంసన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Details
టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు
సంజూ శాంసన్ - 16 సిక్స్‌లు (2026) రోహిత్ శర్మ - 15 సిక్స్‌లు (2024) శివమ్ దూబే - 15 సిక్స్‌లు (2026) ఇషాన్ కిషన్ - 14 సిక్స్‌లు (2026) హార్దిక్ పాండ్యా - 14 సిక్స్‌లు (2026) యువరాజ్ సింగ్ - 12 సిక్స్‌లు (2007) ఈ విధంగా సెంచరీకి చేరువలోనే ఆగిపోయినా సంజూ శాంసన్ తన పేలవమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయానికి కీలక పాత్ర పోషించాడు.