Sanju Samson: భవిష్యత్‌లో ఆరు సిక్స్‌లు కొట్టే బ్యాటర్ సంజు శాంసన్‌నే: సంజయ్ బంగర్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది చాలా అరుదైన ఘనత.
ఈ ఫీట్‌ను భారత్ తరఫున సాధించిన ఏకైక ఆటగాడు యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్స్‌లు కొట్టిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. అయితే మరోసారి ఈ రికార్డు సాధించగల సత్తా ఉన్న బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చాడు.
ప్రస్తుత క్రికెటర్లలో ఆరు సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం ఉన్న బ్యాటర్లు చాలా తక్కువ అని బంగర్ చెప్పారు.
Details
యూవీ రికార్డును సంజు బద్దలు కొట్టే అవకాశం
కానీ ఒక ఆటగాడు మాత్రం ఈ ఘనత సాధించగలరని నమ్ముతున్నానని, అతడే సంజు శాంసన్ అని పేర్కొన్నారు.
సంజుకి క్రమంగా అవకాశాలు ఇస్తూ, అతడిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపితే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తారని కొనియాడారు.
ఫీల్డర్లు ముందుండే సమయంలో సిక్స్‌ల కోసం ఆడడం అతని ప్రత్యేకత అని బంగర్ చెప్పుకొచ్చారు. అందుకే, భవిష్యత్తులో యువీ ఫీట్‌ను సంజు బద్దలు కొట్టే అవకాశం ఉందన్నారు.
ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టీ20ల సిరీస్‌ను స్వదేశంలో ఆడనుంది. ఈ సిరీస్ జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది.
Details
టీ20 జట్టులో సంజు శాంసన్ కు చోటు
ఈ జట్టులో సంజు శాంసన్‌కు చోటు దక్కింది. అతనికి డిప్యూటీగా ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేయడం విశేషం.
సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
యువరాజ్ తర్వాత భారత క్రికెట్‌లో ఈ రికార్డు సాధించే అవకాశం ఉన్న ప్లేయర్‌గా సంజు శాంసన్‌పై బంగర్ అభిప్రాయం స్పష్టంగా అర్థమవుతోంది.
మరి ఈ సిరీస్‌లో సంజు తన ప్రతిభను ఎంతవరకు చూపించగలడో చూడాలి.