LOADING...
Sanju samson: సీఎస్‌కే కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టిన సంజు
సీఎస్‌కే కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టిన సంజు

Sanju samson: సీఎస్‌కే కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టిన సంజు

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారంపై సంజు శాంసన్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. అసలు ఈ చర్చలకు ప్రధాన కారణం క్రికెట్‌ వ్యాఖ్యాతల వ్యాఖ్యలేనని చెప్పాలి. మాజీ భారత క్రికెటర్‌ రవిచంద్రన్ అశ్విన్ కూడా సంజు కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడటంతో ఈ ప్రచారం మరింత వేగం అందుకుంది. అయితే తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీడియోలో సంజు శాంసన్, అభినవ్ ముకుంద్‌తో మాట్లాడిన సందర్భంగా ఈ ఊహాగానాలకు ముగింపు పలికాడు. తాను చెన్నై జట్టులో చేరేటప్పుడు ఎలాంటి షరతులు లేదా ప్రత్యేక అభ్యర్థనలు పెట్టలేదని స్పష్టం చేశాడు.

వివరాలు

నేడు రసవత్తర మ్యాచ్..

''కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నప్పుడు ఎలాంటి డిమాండ్లు పెట్టకూడదనే విషయం నేర్చుకున్నాను'' అని సంజు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై జట్టు ఎంతో నేర్చుకుంటోందని తెలిపారు. అదే సమయంలో సంజుపై అదనపు ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచన తమకు లేదని కూడా చెప్పారు. మరోవైపు, నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు, లక్నోతో తలపడనుంది.

Advertisement