
Sara Tendulkar Deepfake Video : ఫేక్ ఆకౌంట్,డీప్‌ఫేక్ ఫోటోలపై సారా టెండూల్కర్ ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా వేదికగా తన పేరిట జరుగుతున్న అసత్య ప్రచారాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ఖండించింది.
తన పేరిట ఉన్న నకిలీ ఖాతాల్లో డీప్ ఫేక్ ఫోటోలను షేర్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫామ్స్‌కు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు సారా టెండూల్కర్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్టును షేర్ చేసింది.
X వేదికగా తనకు అకౌంటే లేదని, అవన్నీ నకిలీ ఖాతాలని స్పష్టం చేసింది. ఆ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని X ఫ్లాట్ ఫామ్ ను కోరింది.
Details
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు
మన సంతోషాలు, బాధలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ అద్భుతమైన ప్రదేశమని, దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని సారా టెండూల్కర్ మండిపడ్డారు.
తనకు సంబంధించిన డీప్ ఫేక్ ఫోటోలను తాను చూశానని, ఎక్స్ వేదికగా తన పేరిట ఉన్న కొన్ని ఖాతాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు.
వాస్తవాలను పంచుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగించాలని, ఆ తరహా కమ్యూనికేషన్‌ను మాత్రమే ప్రోత్సహించాలని ఆమె కోరారు.