Sara Tendulkar Marriage: సారా టెండ్కూల్కర్ కాబోయే వరుడు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పెళ్లి గురించి మరోసారి సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ చిన్న కుమారుడు రాజ్‌వీర్ డియోల్‌తో సారా ప్రేమలో ఉందని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. దీంతో క్రికెట్, బాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ వార్తల్లో నిజమెంత? నిజంగానే పెళ్లి జరుగుతుందా? అనే ప్రశ్నలకు మాత్రం ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు. కారణం.. సారా లేదా రాజ్‌వీర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడమే.
Details
ఓ పార్టీలో మొదలైన పరిచయమంటూ ప్రచారం
సారా, రాజ్‌వీర్ ఒక పార్టీలో కలుసుకున్నారని, ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారిందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, ఇరు కుటుంబాల మధ్య పెళ్లి విషయమై చర్చలు కూడా జరిగినట్లు కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు బయటకు రావడంతో సారా టెండూల్కర్ పెళ్లి ఎవరితో అనే చర్చ మళ్లీ ఊపందుకుంది.
అయితే ఈ వివరాలకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం, అధికారికంగా వెల్లడైన విషయం మధ్య తేడాను అభిమానులు గమనించాల్సి ఉంది.
Details
సారా, రాజ్‌వీర్ నుంచి స్పందన లేదు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సారా టెండూల్కర్, రాజ్‌వీర్ డియోల్ ఇద్దరూ తమ పెళ్లి వార్తలపై స్పందించలేదు.
ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీ లేదా కుటుంబాల మధ్య జరిగినట్లు చెబుతున్న చర్చలపై కూడా అధికారిక సమాచారం వెలువడలేదు. అందుకే ఈ ప్రచారాన్ని ప్రస్తుతానికి రూమర్‌గానే చూడాల్సి ఉంటుంది.
గతంలో కూడా సారా వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి.
ఇప్పుడు రాజ్‌వీర్ డియోల్ పేరు తెరపైకి రావడంతో ఈ అంశం మరింత వైరల్‌గా మారింది. అసలు విషయం సారా లేదా రాజ్‌వీర్ స్వయంగా వెల్లడిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.