Sarfaraz Khan: పెళ్లి పీటలు ఎక్కిన సర్ఫరాజ్ ఖాన్.. వధువు ఎవరో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకాశ్మీర్ కు చెందిన అమ్మాయిని వివాహమాడాడు. కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఆగస్టు 6న వధువు ఇంట్లో సర్ఫరాజ్ ఖాన్ వివాహం వైభవంగా జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివాహానికి సంబంధించిన ఫోటోలను సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న యువతి పేరు బయటికి రాలేదు.
ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, క్రిస్ గేల్, అభిషేక్ పోరెల్, మన్‌దీప్ సింగ్ పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
Details
రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్
దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ 39 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 3559 పరుగులు చేశాడు.
ఇందులో 13 సెంచరీలను బాదాడు. 2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచులు ఆడి 92.66 సగటుతో 982 పరుగులు చేశాడు.
31 లిస్ట్-ఏ మ్యాచుల్లో 538 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ తరుపున సర్ఫరాజ్ ఖాన్ ఆడుతున్న విషయం తెలిసిందే.
దేశవాళీ క్రికెట్లో రికార్డులు సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలో రీ ఎంట్రీ కోసం వేచిచూస్తున్నాడు.