BWF: క్వార్టర్ ఫైనల్స్ ఆడేందుకు సిద్ధమైన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ముగ్గురు భారత స్టార్ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యారు. సాత్విక్, చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ స్కారప్ రాస్ముస్సేన్, కిమ్ ఆస్ట్రప్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. గత ఎడిషన్‌లో సాత్విక్-చిరాగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ ప్రణయ్ 21-18, 15-21, 21-19 తేడాతో ఏడో సీడ్, ఇండోనేషియా ప్లేయర్ కీన్ యూపై విజయం సాధించిన విషయం తెలిసిందే.
పతకానికి మరో అడుగు దూరంలో సాత్విక్ సాయిరాజ్ అంకిరెడ్డి, చిరాగ్ శెట్టి
మరో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ప్రి క్వార్టర్స్ లోనే ముగిసింది. భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గురువారం సింగపూర్‌కు చెందిన మాజీ ఛాంపియన్ లోహ్ కీన్ యూపై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకానికి మరో అడుగు దూరంలో ఉన్నారు. గత ఎడిషన్‌లో ఈ జోడి కాంస్య పతకాన్ని గెలుపొందింది.